![]() |
![]() |
.webp)
ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే జూనియర్ యాంకర్ లని చూసి సీనియర్ యాంకర్ లు నేర్చుకుంటున్నారు. ఎంతలా నాలుగు పదుల వయసులో ఉన్నవాళ్ళు కూడా అందాల ఆరబోతకి సై అంటూ నెటిజన్లకి షాక్ ఇస్తున్నారు.
తాజాగా గాయత్రి భార్గవి తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలని అప్లోడ్ చేసింది. అవి హాట్ అండ్ బోల్డ్ గా ఉన్నాయి. తనకి ఇన్ స్టాగ్రామ్ లో 173K ఫాలోవర్స్ ఉన్నారు. ఓ టీవీలో 'ఆట కావాలా పాట కావాలా' అనే ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన గాయత్రి భార్గవి.. ఆ తర్వాత ఎన్నో షోలకి యాంకర్ గా చేసి.. ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్లు తెచ్చేసుకుంది. తనకి సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఇందులో ఎనిమిది వేల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. సామజవరగమన, ప్రతీరోజు పండగే, అత్తారింటికి దారేది, అవును, విజేత, విశ్వాసం, గాలిపటం, మర్డర్, మెట్రో కథలు వంటి సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది.
నిన్న మొన్నటి దాకా అటు టీవీ షోలు, ఇటు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. ప్రస్తుతం సినిమాల్లో అంతగా అవకాశాలు రావడం లేదు. అందుకేనేమో తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటో షూట్ చేసేసింది. సీనియర్ యాంకర్ గా గాయత్రి భార్గవికి పేరు ఉంది. అయితే తను పోస్ట్ చేసిన ఫోటోలే కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. అవి చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. లేటు వయసులో ఘాటు సొగసులు, ఇన్ని రోజులు ఎక్కడున్నావ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్, అందమే అసూయపడేలా ఉన్నావ్ అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ' If you are positive you'll see opportunities instead of obstacles '. అంటూ తను షేర్ చేసిన ఫోటోలకి ఓ కొటేషన్ కూడా రాసుకొచ్చింది ఈ భామ. అయితే ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
![]() |
![]() |